: మహిళా న్యాయవాదిపై లైంగిక వేధింపుల కేసులో ఏకే గంగూలీ పేరు
ఓ మహిళా న్యాయవాదిని నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో సుప్రీంకోర్టు మాజీ జడ్డి జస్టిస్ ఏకే గంగూలీ పేరు బయటికొచ్చింది. దేశ ఉన్నత న్యాయస్థానం ఈ పేరును ఈ రోజు వెల్లడించింది. ఈ మేరకు బాధితురాలు తెలిపిన వాంగ్మూలాన్ని ముగ్గురు జడ్జిల కమిటీ ఎదుట రికార్డు చేసి, నివేదికను చీఫ్ జస్టిస్ పి.సదాశివం ఎదుట సమర్పించారు. అనంతరమే గంగూలీ పేరును బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా ఉన్నారు.