: సంక్రాంతిలోపు తెలంగాణ ఏర్పాటు ఖాయం: పాల్వాయి


తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. డిసెంబరు పదిలోగా తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వస్తుందని, సంక్రాంతిలోపు తెలంగాణ ఏర్పడటం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల పంపిణీపై ఈ రోజు తీర్పును ప్రస్తావించిన పాల్వాయి.. వైఎస్ హయాంలో అసమర్థ న్యాయవాదులను పెట్టడం వల్లే రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మిగులు జలాలు కేటాయించాలని ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News