: విజయనగరంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో 59వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత లభిస్తుంది.