: గోదావరి నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల పరిధిలోని గూడెం సమీపంలో గోదావరి నదిలో మునిగి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం రేకిని గ్రామస్థులైన తిరుపతి, రాజశేఖర్ లు తమ స్నేహితులతో కలసి గోదావరి నదికి వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగిన వీరిద్దరూ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం లక్సరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.