: జగన్ సమైక్య శంఖారావం రేపట్నుంచే
వైకాపా అధ్యక్షుడు చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర రేపట్నుంచి ప్రారంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. శ్రీకాకుళం జిల్లా వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను కూడా జగన్ ఓదారుస్తారు.
రేపు ప్రారంభం కానున్న సమైక్యశంఖారావం యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లేందుకు సీబీఐ కోర్టును జగన్ కోరారు. అలాగే డిసెంబర్ 2న కుప్పం నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చేందుకు అనుమతించాలని కోర్టును కోరారు.