: సహజీవనం నేరం కాదు: సుప్రీంకోర్టు


సహజీవనం నేరం, పాపం కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక వ్యక్తితో సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనకు భరణం ఇప్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. సమాజం అంగీకరించకపోయినా సహజీవనం తప్పేమీ కాదని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలా? వద్దా? ఎంతమందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండాలనేది వ్యక్తుల ఇష్టానికి సంబంధించిన విషయాలుగా తెలిపింది. కాకపోతే, ఈ బంధంలోనూ మహిళలు బాధితులుగా మారే ప్రమాదం ఉందని, వారికి రక్షణ కల్పించేలా సహజీవనానికి సంబంధించి చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. అక్రమ సంబంధాలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి రావని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News