: నలుపైతేనేం... బోలెడు సుగుణాలున్నాయి


నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నల్లని వస్తువులను మనం పెద్దగా ఇష్టపడం. కారణం వాటి రంగు. కానీ నల్లని వాటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఇక క్యారెట్‌ విషయానికొస్తే చక్కటి ఎర్రటి ఎరుపు రంగులో ఉండే నోరూరించే క్యారెట్‌ను ఇష్టపడని వారుండరు. అలాకాకుండా నల్లటి క్యారెట్‌ను తయారుచేస్తే... ఇలాంటి నల్లటి రంగులో ఉండే క్యారెట్‌ను పరిశోధకులు తొలిసారిగా పండించారు. ఈ క్యారెట్‌ రంగు నల్లగా వున్నా ఇందులోని ఆరోగ్య విలువలు మాత్రం చాలా ఎక్కువేనని పరిశోధకులు చెబుతున్నారు.

ఎర్రటి క్యారెట్‌లో ఎ విటమిన్‌ అధిక మొత్తంలో ఉంటుందని మనందరికీ తెలుసు. క్యారెట్‌లు పలు రంగుల్లో లభించినా మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది మాత్రం ఎరుపు రంగు క్యారెట్టే. కానీ మొట్టమొదటిసారిగా నల్లటి రంగులో క్యారెట్‌ను పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కొత్తరకం నల్లటి క్యారెట్‌ రక్తహీనత, జీర్ణకోశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందని విశ్వవిద్యాలయానికి చెందిన కూరగాయల శాస్త్రవేత్త టి.ఎస్‌.థిల్లాన్‌ చెబుతున్నారు. ఈ నల్లక్యారెట్‌ గురించి ఆయన మాట్లాడుతూ ఈ నల్లబంగారం అద్భుతంగా రక్తాన్ని శుద్ధి చేస్తుందని, రక్తహీనత, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుందని, దీన్ని నాటిన 93 రోజుల్లోనే పంట చేతికొస్తుందని చెబుతున్నారు. ఈ కొత్తరకం వంగడం ఎకరాకు 196 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే అవకాశం ఉందని, సాధారణ క్యారెట్‌ కంటే కూడా ఇందులో నాలుగురెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

  • Loading...

More Telugu News