: అరుదైన 'బొక్కల' సంపద!


బొక్కలు అంటే ఎవరు ఎలాంటి అర్థంలో వాడతారో గానీ కొంతమంది మాత్రం ఎముకలనే అర్థంలో వాడతారు. అలాంటి ఎముకలను కోట్లు పెట్టి సొంతం చేసుకునేవారుంటారా... అంటే ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే నాలుగు కోట్లు వెచ్చించి ఎముకలను సొంతం చేసుకున్నారట ఒక పెద్ద మనిషి.

లండన్‌లోని సమ్మన్స్‌ సంస్థ వారు ఒక డైనోసార్‌ అస్థిపంజరాన్ని వేలం వేశారు. దీనిపై మోజుకొద్దీ ఒక సంపన్నుడు కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. నాలుగు కోట్ల రూపాయలను వేలంలో వెచ్చించి డైనోసార్‌ అస్థిపంజరాన్ని కొనుగోలు చేయడానికి కారణం, అది సుమారు 15 కోట్ల సంవత్సరాల కిందటిది కావడమే. ప్రపంచం మొత్తంమ్మీద ఇలాంటివి కేవలం ఆరు మాత్రమే ఉన్నాయట. అందువల్లే దీనికి ఇంత ధర పలికిందని వేలం నిర్వాహకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News