: త్రిపురాంతకం ఆలయ గోపురంపై పిడుగు
ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలోని బాలత్రిపురసుందరీదేవి ఆలయంపై ఈ సాయంత్రం పిడుగుపడింది. దీంతో ఆలయ గాలిగోపురం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆలయ అర్చకుడు ప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. పిడుగు తీవ్రతకు ఆలయ ప్రాంగణంలోని జనరేటర్ పూర్తిగా దెబ్బతింది.