: దెయ్యాలున్నాయంటూ పాఠశాలలో క్షుద్రపూజలు


మూఢనమ్మకాలపై అపోహలు తొలగించాల్సిన ఉపాధ్యాయులే మూఢనమ్మకాలను పెంచి ప్రోత్సహించిన వైనం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో దెయ్యాలున్నాయంటూ అలజడి సృష్టించారు. విద్యార్థులను ఇళ్లకు పంపేసి క్షుద్రపూజలు చేయించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ పాఠశాలలో క్షుద్రపూజలు చేయడమేంటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీసేందుకు విద్యార్థులను రప్పించాలని ఆదేశించారు. దీనిపై డీఈవో రమేష్ పై స్మితాసబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News