: యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్


ఇటీవల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సచిన్ టెండుల్కర్ తాజాగా.. 'యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. రెండు సంవత్సరాల పాటు అంబాసిడర్ గా వ్యవహరించే సచిన్.. దక్షిణాసియాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రచారం చేయనున్నాడు. ముంబైలో యూనిసెఫ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాస్టర్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇంత అందమైన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. యూనిసెఫ్ రాయబారిగా చేసేందుకు ఎదురుచూస్తున్నానన్న సచిన్.. తన సామర్ద్యం మేరకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ రెండో ఇన్నింగ్స్ తనకు చాలా ముఖ్యమని తెలిపాడు.

  • Loading...

More Telugu News