: మల్లికార్జునుడికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఏరాసు


ఎప్పట్లానే మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జునుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ పర్యాయం న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలు అందిస్తారు. కాగా, లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం 10 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం శ్రీశైలంలో పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన మాట్లాడుతూ, శివరాత్రి రోజు ఉదయం 6 గంటల నుంచి  8 గంటల వరకే విఐపిలకు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా శ్రీశైలం, దోర్నాల మార్గంలో కేవలం బస్సులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News