: 'బ్రిటన్ అత్యంత ప్రభావవంతురాలైన ఆసియన్' గా మలాల
పాకిస్థాన్ సాహస బాలిక మలాల యూసఫ్ జాయ్ పలు దేశాల గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో 'బ్రిటన్ అత్యంత ప్రభావవంతురాలైన ఆసియన్'గా మలాల తాజాగా ఎంపికైంది. లండన్ లోని ఓ వార్తాపత్రిక నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. లండన్ లో నిన్న నిర్వహించిన 'జీజీ2 (గార్వి గుజరాత్2) లీడర్ షిప్ అవార్డ్స్-2013' కార్యక్రమంలో... మలాల, కైనత్ రైజ్, షాజియా రంజాన్ లు ధైర్యానికి గుర్తింపుగా జీజీ2 హేమర్ పురస్కారాన్ని అందుకున్నారు. గతేడాది పాక్ లోని స్వాత్ వ్యాలీలో చోటు చేసుకున్న తాలిబాన్ల దాడిలో మలాలతో పాటు మిగతా ఇద్దరూ గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో వారికీ ఈ అవార్డును అందించారు.