: 'ఆప్' తో పొత్తా?.. సమస్యే లేదు: షీలాదీక్షిత్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో సంకీర్ణ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకోవడం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బలాన్ని ఇస్తారని తెలిపారు. సీట్లు తగ్గితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ 'పొత్తుల సమస్యేలేద'ని స్పష్టం చేశారు. 'ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా' అంటే 'ఏం జరుగుతుందో చూద్దాం' అని షీలాదీక్షిత్ అన్నారు.

  • Loading...

More Telugu News