: ఆర్టీఐ చట్టం కింద డాక్యుమెంట్స్ కోసం రూ. 1.34 కోట్ల డిమాండ్
బీహార్ లో ఆర్టీఐ చట్టం కింద వివరాలు అడిగిన ఆర్టీఐ కార్యకర్త శివప్రకాష్ రాయ్ కి అధికారులు దిమ్మ తిరిగేలా చేశారు. మామూలుగా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాల పత్రాలు పొందాలంటే రూ. 10 చెల్లిస్తే సరిపోతుంది. అయితే బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో వ్యవసాయ భూమి పత్రాలు అడిగితే కోటి 34 లక్షలు డిమాండ్ చేయడంతో శివప్రకాష్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళితే... వ్యవసాయ భూమిని కమర్షియల్ కేటగిరికి మార్పు చేసిన పత్రాలను ఇవ్వాలని బెగుసరాయ్ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులను శివప్రకాష్ రాయ్ అనే వ్యక్తి కోరారు. అయితే తాము కోరిన మొత్తాన్ని చెల్లిస్తేనే పత్రాలు ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం సమాచార హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘించడమేనని రాయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.