: ఆడికార్ల ధరలు ఐదు శాతం పెంపు


ఆడికార్ల ధరలను ఐదు శాతం పెంచుతున్నట్లు జర్మనీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడీ ఓ ప్రకటనలో తెలిపింది. పలు ఆర్థికపరమైన కారణాలు వ్యాపారంపై ఒత్తిడి పెంచడంవల్లే ధరను పెంచినట్లు ఆడి ఇండియా విభాగం తెలిపింది. ధరల పెరుగుదల కార్ల అమ్మకాలపై కొంత వ్యతిరేక ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఆడి సంస్థ సెడాన్స్ ఏ4, ఏ6, ఏ8, ఎస్ 4... ఎస్ యూ వీలు క్యూ3, క్యూ5, క్యూ7... స్పోర్ట్స్ కార్లు ఆర్8, ఆర్8... స్పైడర్ మోడల్ వి8 లను 27.93 లక్షల నుంచి 2.14 కోట్ల రూపాయల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆడి సంస్థ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని సంస్థ మేనేజర్ అన్నారు. కాగా, వినియోగదారులను ఆకర్షించడానికి ఆడి ఫైనాన్స్ నుంచి సులభతరమైన ఆప్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News