: మోడీ ఆదరణ కిషన్ రెడ్డి తనదే అనుకుంటున్నారు: కొత్తకోట
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న ఆదరణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనదిగా భావిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ టీడీపీని కిషన్ రెడ్డి విమర్శించడం సరి కాదని హితవుపలికారు. గ్రామాలకు వెళ్లి టీడీపీని విమర్శిస్తే తిరుగుబాటు అంటే ఏమిటో ప్రజలు చూపిస్తారని ఆయన హెచ్చరించారు.