: ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న తేజ్ పాల్


లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో 'తెహల్కా' మాజీ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. గోవా పోలీసులు తనను ఏ సమయంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారంతో తేజ్ పాల్ రెండు రోజుల కిందట ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఆదేశాలను రేపటివరకు రిజర్వులో ఉంచింది. ఈ క్రమంలో తేజ్ పాల్ పిటిషన్ వెనక్కు తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News