: కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళ
ప్రఖ్యాత రియాల్టీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)లో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫిరోజ్ ఫాతిమా 2013లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళగా ఘనత దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కోటి రూపాయలు గెలుచుకున్న ఫాతిమాను అమితాబ్ అభినందించారు. తాను ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నానంటే నమ్మశక్యంగా లేదని... చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి రుణాన్ని తీర్చుకునేందుకే తాను కేబీసీని ఎంచుకున్నానని ఫాతిమా వెల్లడించింది. అప్పులు తీర్చేందుకు, భవిష్యత్ కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తానని ఆనందంతో ఆమె వ్యాఖ్యానించింది.