: సురక్షిత ప్రాంతాలకు ఆరు వేల మంది
లెహర్ తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని తీరం వెంబడి 5 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 6 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలను కృష్ణా జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 80 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటనుందని అధికారులు చెప్పారు.