: శోమాచౌదరి అరెస్ట్ కోరుతూ బీజేపీ కార్యకర్తల ధర్నా


తెహల్కా పత్రిక మేనేజింగ్ ఎడిటర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన శోమా చౌదరిని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ కార్యకర్తలు దక్షిణ ఢిల్లీలోని ఆమె నివాసం ముందు ధర్నా తలపెట్టారు. తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శోమాచౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరుణ్ లైంగిక వేధింపులపై ఆమె తగిన చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నేత జాలీ మాట్లాడుతూ.. శోమా తన సహచర మహిళా ఉద్యోగికి మద్దతివ్వకుండా.. వారం రోజుల నుంచి బాధితురాలి ఫిర్యాదును.. కేసులోని నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News