: గోవా పోలీసులకు తేజ్ పాల్ లేఖ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహెల్కా' మాజీ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ గోవా పోలీసులకు లేఖ రాశారు. విచారణాధికారి ముందు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని, ఇందుకోసం రెండు రోజుల గడువు కావాలని కోరారు. శనివారం మధ్యాహ్నంలోగా హాజరవుతానని తెలిపారు. కాగా, ఈ రోజు మూడు గంటలలోపు తమ ఎదుట విచారణకు హాజరవ్వాలని గోవా పోలీసులు నిన్న తేజ్ పాల్ కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ వ్యవహారంలో బయటపడేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లడంలేదని తేజ్ పాల్ లాయర్ సందీప్ కపూర్ పేర్కొన్నారు.