: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు రోజు నిర్వహించే లక్ష కుంకుమార్చనను ఆలయంలోని కృష్ణస్వామి మంటపంలో ఇవాళ అర్చకులు నిర్వహించారు.