: అబూసలేంకు ఏడేళ్ల జైలు శిక్ష


నకిలీ పాస్ పోర్టు కేసులో అబూసలేంకు హైదరాబాదు సీబీఐ స్పెషల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనికి తోడు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ కేసులో ఇప్పటికే అబూసలేంను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం అబూసలేంను పోలీసులు థానే జైలుకు తరలిస్తున్నారు. మాఫియా డాన్ అబూసలేంను ముంబై పోలీసులు ఈ రోజు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. అబూసలేం కర్నూలు నుంచి 2001లో తప్పుడు పత్రాలతో నకిలీ పాస్ పోర్టు పొందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు పన్నెండేళ్ల నుంచి విచారణ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు ఆరేళ్ల శిక్షను అబూసలేం అనుభవించారు. ఇంకొక 11 నెలల శిక్షాకాలం మాత్రమే మిగిలిఉంది.

  • Loading...

More Telugu News