: కొత్త రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి... బైరెడ్డి
రాయల తెలంగాణకు తాము పూర్తిగా వ్యతిరేకమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమైతే, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కొత్త రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిగులు జలాలను కూడా రాయలసీమకు పంచాలని డిమాండ్ చేశారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లకు ఓట్లు, సీట్లు మాత్రమే కావాలని... ప్రజల మనోభావాలు అవసరం లేదని విమర్శించారు.