: పాక్ కొత్త ఆర్మీ చీఫ్ తో కలిసి పనిచేస్తాం: అమెరికా


పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటన జారీ చేసింది. కయానీ(పాక్ ఆర్మీ మాజీ చీఫ్)తో కలిసి అనేక అంశాలపై పనిచేశామని.. ఆయన స్థానంలో వచ్చేవారితోనూ కలిసి పనిచేసేందుకు వేచి ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు. కయానీ పదవీకాలం శుక్రవారంతో ముగిసిపోతున్నందున లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ ను ఆర్మీ కొత్త చీఫ్ గా నియమిస్తూ పాక్ నిన్న నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News