: వీరేంద్ర సెహ్వాగ్ కు లక్ష్మణ్ బాసట
భారత్ డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కి మద్దతు పెరుగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి రెండు టెస్టు మ్యాచులకూ సెహ్వాగ్ ను తప్పించడాన్ని ఒక్కక్కరే తప్పుపడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సునీల్ గవాస్కర్ మద్దతు పొందిన సెహ్వాగ్, తాజాగా వీవీయస్ లక్ష్మణ్ మద్దతు కూడా పొందాడు.
త్వరలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచులకు వెళ్ళాల్సిన తరుణంలో ఇప్పుడు సెహ్వాగ్ ను తప్పించడం ఘోరమైన తప్పిదమని లక్ష్మణ్ అన్నాడు. అతనిని తప్పించడానికి ఇది సమయం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. సెహ్వాగ్ లేకుండా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నించాడు.