: చూసినా ఫిట్‌గానే ఉంటామట
ఆటలు ఆడడం వల్ల శరీరం చాలా ఫిట్‌గా ఉంటుందని మనకు తెలుసు. కానీ, ఆటలను చూసినా కూడా ఫిట్‌గా ఉంటామట. ఈ విషయాన్ని పరిశోధకులు ప్రత్యేక అధ్యయనంలో కనుగొన్నారు. ఆటలు ఆడితేనేకాదని, చూసినా కూడా శరీరం ఫిట్‌గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
టీవీల్లో వచ్చే ఆటల పోటీలను ఎక్కువమంది చూస్తుంటారు. ముఖ్యంగా క్రికెట్ వస్తే ఇక చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. ఇలా ఆటలను టీవీల్లో చూడడం వల్ల కూడా మనం ఫిట్‌గా ఉంటామట. ఎందుకంటే ఇతరులు చేసే వ్యాయామాన్ని చూడడం వల్ల మన గుండెతోబాటు శరీరంలోని ఇతర అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. టీవీల్లో ఆటలను చూసే సమయంలో శారీరక, మానసిక ఒత్తిళ్లు 'సింపతెటిక్ నెర్వస్ సిస్టమ్'పై ప్రభావం చూపుతాయని, దాని ఫలితంగా మన గుండె కొట్టుకోవడం వేగవంతం కావడంతోబాటు శరీరంలోని రక్తప్రసరణ వేగం కూడా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధంగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు.