: నిద్రపోయి బతికిపోయాడట!
కొందరు నిద్రపోయి కొన్ని అవకాశాలను పోగొట్టుకుంటారు. అలా నిద్ర పోవడం వల్ల మరణించాల్సిన అవకాశాన్ని మిస్సయ్యాడట ఒక వ్యక్తి. షుగరు వ్యాధితో బాధపడుతున్న సుకాంత్ రౌత్ అనే వ్యక్తి నిద్ర పోవడం వల్ల తాను బతికిపోయానని చెబుతున్నాడు.
షుగరుతో బాధపడుతున్న సుకాంత్ రౌత్ చికిత్స కోసం ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరారు. అక్కడ ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ఒక నర్సు ఇంజెక్షన్‌ను సిద్ధం చేసింది. అయితే నర్సు ఇలా సూదిమందు రెడీ చేసేసరికి సుకాంత్ చక్కగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో సదరు నర్సుగారు ఇంజెక్షన్‌ను పట్టుకోమని ఆయన పక్కనేవున్న ఆయన భార్య సరోజిని చేతికి ఇచ్చారు. అయితే ఆ సూదిమందులో మందుతోబాటు వేరే పదార్ధమేదో తేలుతూ ఉండడం చూసిన సరోజిని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ విషయాన్ని నర్సుకు చెప్పింది. నర్సు వెంటనే ఆ ఇంజెక్షన్‌ను లాక్కొని చెత్తబుట్టలో పడేసిందట. ఈ విషయం సరోజిని భర్తకు చెప్పింది. ఇంజెక్షన్ విషయం గురించి అడిగితే నర్సు సరైన సమాధానం చెప్పలేదట. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సు ఇంజెక్షన్ తెచ్చిన సమయంలో నేను నిద్రపోయానుగాబట్టి సరిపోయింది, లేకుంటే ఈపాటికి చనిపోయి ఉండేవాణ్ని అంటున్నాడు సుకాంత్. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.