: కేసు ఛేదనలో జాగిలాలు కీలకం: డీజీపీ


నేర పరిశోధనతో పాటు నేరస్థులను తొందరగా పట్టుకునేందుకు జాగిలాలు బాగా ఉపయోగపడుతున్నాయని డీజీపీ ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 13 వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన మాట్లాడుతూ నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలికి వెళితే కేసు తొందరగా ఛేదించేందుకు ఎక్కువ అవకాశం దొరుకుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన శునకాలతో ప్రదర్శన నిర్వహించారు. జాగిలాలు బాంబులు గుర్తించడం వంటి విన్యాసాలతో అలరించాయి.

  • Loading...

More Telugu News