: ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై మల్లగుల్లాలు


కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై పార్టీ పెద్దలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. నిన్నల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆజాద్, సోనియా కార్యదర్శి అహ్మద్ పటేల్ తో ఎడతెగని చర్చలు నిర్వహించారు. ఎంపికలో వివిధ  సామాజిక వర్గాలను, పలు అంశాలను పరిగణలోకి తీసుకోవలసి ఉన్నందున ఈ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో పలు రకాల ఒత్తిళ్ళు వుంటాయి. ఇప్పుడివి తారస్థాయిలో ఉన్నందున ఎంపిక అధిష్ఠానానికి కత్తిమీద సాములా తయారైంది. ఇప్పటికే ఓ జాబితా తయారైందనీ, ఈ ఉదయం మళ్ళీ సోనియాతో చర్చించిన తర్వాత చివరి జాబితాను విడుదల చేస్తారనీ అంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ ఆశావహులతో ఢిల్లీ లోని ఏపీ భవన్ కళకళలాడుతోంది.            

  • Loading...

More Telugu News