: తేజ్ పాల్ తో కానీ, తెహెల్కాతో కానీ నాకు సంబంధాలు లేవు: కపిల్ సిబాల్


తరుణ్ తేజ్ పాల్ కానీ, తెహెల్కా పత్రికతో కానీ తనకు సంబంధాలు లేవని కేంద్ర న్యాయశాఖా మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకార్లలా తేజ్ పాల్ తల్లి తనకు చెల్లెలు కాదని అన్నారు. తెహల్కా వాటాదారుడైన కేంద్ర మంత్రి ... తరుణ్ తేజ్ పాల్ ను రక్షిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ, బీజేపీలను తాను విమర్శిస్తున్నానన్న దుగ్దతోనే సుష్మాస్వరాజ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. చేతనైతే తనకు, తేజ్ పాల్ కు ఉన్న సంబంధాలను బహిరంగ పరచాలని సవాలు విసిరారు. అంతటితో ఆగకుండా సుష్మాస్వరాజ్ కోట్లాది రూపాయల మైనింగ్ కుంభకోణానికి కారణమైన రెడ్డి (గాలి జనార్థన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి) బ్రదర్స్ ను కాపాడుతున్నారని సిబాల్ విమర్శించారు.

  • Loading...

More Telugu News