: టీడీపీతో పొత్తుపై పరిశీలిస్తున్నాం: కిషన్ రెడ్డి
రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర పార్టీలతో బీజేపీ ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని అన్నారు. అయితే విభజన తరువాత టీడీపీతో పొత్తుపై పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినందునే టీఆర్ఎస్, టీడీపీలు తమతో పొత్తుకు ఆరాటపడుతున్నాయన్నారు. రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నందు వల్లే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయన వెల్లడించారు.