: ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న వ్యక్తి అరెస్టు
విజయనగరం జిల్లాలో ఉద్యోగాల పేరిట యువకులను మోసగిస్తున్న రమణ అనే బ్రోకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రమణ 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో నలుగురు యువకుల నుంచి 1.6 లక్షల రూపాయలు తీసుకుంటూ రమణ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు.