: ప్రజల ఆస్తులను పరిరక్షిస్తా: పాదయాత్రలో బాబు
కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పాదయాత్ర ప్రజల కోసమేనని పేర్కొన్నారు.
ప్రజల ఆస్తులు పరిరక్షించడమే తన ధ్యేయమన్నారు. సాగునీరు, తాగునీరు కాపాడడానికి టీడీపీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, రేపు ఆలపాడు వద్ద టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని టీడీపీ.. వామపక్షాలకు లేఖ రాసింది.