: కూతురి ఆరోగ్యం విషమం.. రేపు భారత్ రానున్న ప్రచండ
నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు అధినేత ప్రచండ కూతురు జ్ఞాను కేసీ దహా (40) రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడేళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన జ్ఞాను ముంబైలో చికిత్స పొందారు. కానీ, మళ్లీ కేన్సర్ తిరగబెట్టడంతో గతేడాది ఆమె అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ కాన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో నెలన్నర నుంచి నోయిడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తమ కూతురిని చూసేందుకు ప్రచండ తన భార్యతో కలసి రేపు భారత్ వస్తున్నారు. ఈ వివరాలను ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.