: షారుఖ్ టెక్స్ట్ బుక్ లాంటి వాడు: శ్రేయాస్ తల్పడే


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వారిలో సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా వీరిలో సహనటుడు శ్రేయాస్ తల్పడే వచ్చిచేరాడు. ఓం శాంతి ఓం, ఇక్బాల్, వెల్ కం టు సజ్జన్ పూర్, గోల్ మాల్, హౌస్ ఫుల్ సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్న శ్రేయాస్ తల్పడే... ఓ ఛానెల్ తో మాట్లాడుతూ షారుఖ్ తో పని చేయడాన్ని మర్చిపోలేనని అన్నాడు. కొత్త తరం హీరోలకు షారుఖ్ ఓ టెక్స్ట్ బుక్ లాంటి వాడని అభిప్రాయపడ్డాడు. షారుఖ్ కేవలం నటలోనే కాక నిర్మాణ రంగంలో కూడా తనకు స్ఫూర్తిగా నిలిచాడని పొగడ్తల్లో ముంచెత్తాడు.

  • Loading...

More Telugu News