: 90 న్యూ జనరేషన్ శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆంధ్రాబ్యాంక్


ఆంధ్రా బ్యాంక్ విజయ పథంలో 9 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నవశక్తి పేరుతో 90 న్యూ జనరేషన్ శాఖలను అందుబాటులోకి తెచ్చింది. న్యూ జనరేషన్ శాఖలను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కె.కె.మిశ్రా, ఎన్.కె.కైరాలు ఆవిష్కరించారు. ఈ శాఖలలో డిపాజిట్లు చేసుకొనేందుకు క్యూలో వేచి ఉండాల్సిన పని లేకుండా ఏటీఎం తరహాలో అత్యాధునిక మిషన్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రాబ్యాంక్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ టీవీఎన్ చంద్రశేఖర్ చెప్పారు. త్వరలోనే ఈ ప్రత్యేక సదుపాయం గల శాఖలను 250 నుంచి 300కు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News