: ధావన్ ఔట్... ఇండియా 218/4
218 పరుగుల వద్ద భారత్ శిఖర్ ధావన్ వికెట్ ను కోల్పోయింది. 95 బంతుల్లో 119 పరుగులు చేసిన ధావన్ బ్రావో బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు 55 పరుగులు చేసిన యువరాజ్ జట్టు స్కోరు 190 పరుగుల వద్ద ఔటయ్యాడు. సురేష్ రైనా 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రైనాకు కెప్టెన్ ధోనీ జతకలిశాడు. విజయానికి భారత్ మరో 46 పరుగులు చేయాల్సి ఉంది.