: ఒత్తిడి తొలగించుకునేందుకు నేతల మార్గాలు


ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు చిత్ర విచిత్ర, టక్కు టమారా, గజకర్ణ గోకర్ణ విద్యలు.. సత్య, అసత్య ఆరోపణలు ఇలా అన్ని విద్యలతో ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించాలి. అప్పుడే వారికి విజయం ప్రాప్తిస్తుంది. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా వేళకు తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. దీంతో వారిపై చెప్పలేనంత ఒత్తిడి ఉంటుంది.

తెలివైన నేతలు కొందరు ఈ ఒత్తిడిని తీసేసేందుకు యోగా, ధ్యానం, పుస్తకపఠనం, మనసుకు నచ్చిన క్లాసికల్ గీతాలు వినడం, ఈత కొట్టడం చేస్తున్నారు. ప్రతీ రోజు తాను 15 నిమిషాల పాటు పుస్తకాలు చదువుతున్నానని ఢిల్లీ సాంఘీక సంక్షేమ మంత్రి కిరణ్ వాలియా తెలిపారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మాల్వియా నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజేంద్ర గుప్తా కూడా ఉదయాన్నే నడుస్తున్నారట. ఇలా వీరే కాదు చాలా మంది నేతలు తమ ఒత్తిడిని తొలగించుకుని మానసికంగా ఫిట్ గా ఉండేందుకు పరిశ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News