: తరుణ్ తేజ్ పాల్ కు గోవా పోలీసుల సమన్లు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహల్కా' మాజీ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ను ప్రశ్నించేందుకు గోవా పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు తేజ్ పాల్ కు సమన్లు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు నిన్న రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తేజ్ పాల్ దేశం విడిచి వెళ్లకుండా గోవా పోలీసులు లుకవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.