: ఆంటోనీ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి, జీవోఎం సభ్యుడు ఆంటోనీ నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ రోజు జీవోఎం పూర్తి స్థాయిలో సమావేశం కానున్న నేపథ్యంలో వీరి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి షిండే, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, నారాయణస్వామి హాజరయ్యారు.