: కర్నూలు ఎస్పీ బదిలీపై నేడు తీర్పు
తన బదిలీని సవాలు చేస్తూ కర్నూలు ఎస్పీ కె.రఘురాంరెడ్డి క్యాట్ లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నిన్న వాదనలు ముగిశాయి. విచారణ చేపట్టిన జస్టిస్ స్వరూప్ రెడ్డి, రంజనా చౌదరిలతో కూడిన ధర్మాసనం తీర్పును ఈ రోజుకు వాయిదావేసింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, ఎస్పీని సాధారణ ఉద్యోగిలా బదిలీ చేశారని రఘురాంరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.