: తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. 39/1
కాన్పూర్ లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 11 పరుగులు చేసిన ఓపెనర్ ఛార్లెస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కీరన్ పావెల్ (19), శామ్యూల్స్ (9) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 10 ఓవర్లలో 39 పరుగులు చేసింది.