: పిల్లలకు అల్లం ఎంత మేలుచేస్తుందటే...


అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చిన్నారులకు మరింత మేలు చేస్తుందని, వారిని అనారోగ్యాల బారినుండి కాపాడడంలో ఎంతో ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఉపయోగించే కృత్రిమ ఆహారం పొడి (ఫార్ములాఫుడ్‌)లోని మాలిన్యాలను తొలగించే శక్తి అల్లానికి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లంలో ఉండే రెండు రకాల రసాయనాలు పిల్లల కృత్రిమ ఆహారంలో ఉండే రోగకారకాలను నిర్మూలిస్తాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అల్లంలోని 'డయల్లీ1 సల్ఫైడ్‌', 'అజోయెన్‌' అనే రెండు రకాల కాంపౌండ్లు పిల్లలకు ఆహారంగా ఉపయోగించే కృత్రిమ ఆహారం పొడిలో ఉండే మాలిన్యాలను తొలగించే శక్తిని కలిగివున్నాయని పరిశోధనల్లో గుర్తించారు. పిల్లల కృత్రిమ ఆహారం పొడిలో క్రోనోబ్యాక్టర్‌ సాకాజాకీ వంటి రోగకారకాలతో మలినమయ్యే ముప్పును తగ్గించే శక్తిని అల్లంలో ఉండే రెండు రకాల కాంపౌండ్లు గణనీయంగా కలిగివున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సీ సాకాజాకీ అనేది ఆహారంలో ఉండే రోగకారకం. ఇది కొన్నిసార్లు శిశువుల కృత్రిమ ఆహార పొడులు, ఇతర సమృద్ధ ఆహారంలో కూడా కనిపిస్తుంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ అరుదైనదే అయినా కూడా ఇది శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. శాస్త్రవేత్తలు అల్లంలో తాజాగా గుర్తించిన రెండు రసాయన కాంపౌండ్లు సీ సాకాజాకీని హతమార్చడంలో మంచి ప్రభావాన్ని చూపుతున్నట్టు గుర్తించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న క్సియావోనస్‌ లూ మాట్లాడుతూ అల్లంలోని ఈ కాంపౌండ్లను ఆహార తయారీ ప్రక్రియలో ప్రతి దశలోనూ ఉపయోగించడం, వాటితో పరికరాలను శుభ్రపరచడం ద్వారా మాలిన్య ముప్పును నిరోధించవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News