: ఐటీ శాఖతో సమాచారం పంచుకుంటాం: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం


ఐటీ శాఖకు, వారు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఎమ్మార్ కేసులో ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు ఆదాయ పన్ను శాఖకు అందివ్వాలని సీబీఐ న్యాయమూర్తి తమ సిబ్బందికి సూచించారు.

ఎమ్మార్ హిల్స్ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ చాలా సమాచారం సేకరించింది. సీబీఐ అందించే వివరాలను పరిశీలిస్తే ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్ ఆదాయ పన్ను మదింపు సులువు అవుతుందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News