: ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం: హరీష్ రావు


కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీఎం వైద్య ఆరోగ్య శాఖను అనేక ముక్కలు చేసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నుంచి హెల్త్ అసిస్టెంట్లు రోడ్డున పడినా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కలెక్టర్లు, వైద్యులు ఎవరికి కోపం వచ్చినా ఏఎన్ఎం, నర్సులపై చూపిస్తారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News