: పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కు చేదు అనుభవం


టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కు న్యూజిలాండ్ లోని అక్లాండ్ లో చేదు అనుభవం ఎదురయ్యింది. స్టేజ్ షో కోసం అక్లాండ్ చేరుకున్న బీబర్ బసచేసేందుకు స్టార్ హోటల్ కు చేరుకున్నాడు. అయితే, హోటల్ యాజమాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయనని, హోటల్ రూల్స్ కు వ్యతిరేకంగా నడవననే హామీ పత్రం మీద సంతకం పెడితేనే హోటల్ లో సూట్ కేటాయిస్తామని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా, హామీ పత్రంలో అమ్మాయిలను సూట్ కు తీసుకురానని, విలాసవంతమైన సమావేశ మందిరంలో తిననని హామీ ఇవ్వాల్సి వచ్చింది.

దీనిపై బ్రిటన్ లోని ఓ వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తమ హోటల్ లో బస చేసేవారికి ఎలాంటి హోదా ఉన్నా తమకు పట్టింపులేదని, నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తించాలని హోటల్ యాజమాన్యం స్పష్టం చేసిందని కథనంలో పేర్కొంది. గత నెలలో బ్రెజిల్ లోని రియోడీజెనీరోలో ఓ వేశ్యా గృహంలో బీబర్ కనిపించి అక్కడి అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News