: సినిమాను తలపించిన ఛేజ్.. బెజవాడలో దొంగా పోలీస్
విజయవాడలో దొంగా పోలీస్ ఛేజ్ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఛేజ్ లో దొంగలే సఫలీకృతులయ్యారు. ఏపీ 31 టీవీ 1108 కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో విజయవాడ పోలీసులు కారును వెంబడించారు. కొంత సేపు ఛేజ్ జరిగిన తరువాత కనకదుర్గమ్మ వారధి వద్ద దొంగలు ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు సభ్యులున్న దొంగల ముఠా పోలీసులను తోసి వేసి వాకీటాకీ లాక్కుని పరారయ్యారు. దుండగులు గుంటూరువైపు వెళ్లారన్న సమాచారంతో గుంటూరు, విజయవాడ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.