: తల్వార్లకు ఏయే సెక్షన్ల కింద ఎంత శిక్ష?


ఆరుషి జంట హత్యల కేసులో ఆమె తల్లిదండ్రులకు ఘజియాబాద్ సీబీఐ కోర్టు జీవిత ఖైదును విధించింది. వీరిద్దరికీ సెక్షన్ 302 (హత్య) కింద జీవిత ఖైదును, సెక్షన్ 201 (సాక్ష్యాలను రూపుమాపడం) కింద ఐదేళ్ల కారాగార శిక్షను విధిస్తున్నట్టు స్పెషల్ సీబీఐ జడ్జి శ్యాంలాల్ తీర్పునిచ్చారు. దీనికి తోడు, రాజేష్ తల్వార్ కు సెక్షన్ 203 (తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం) కింద మరో ఏడాది జైలు శిక్షను విధించారు. అంతే కాకుండా రాజేష్ తల్వార్ కు 18 వేలు, నుపుర్ తల్వార్ కు 15 వేల జరిమానా విధించారు. అయితే సీబీఐ కోర్టు తీర్పుతో తాము ఏకీభవించడం లేదని... అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేస్తామని తల్వార్ల తరఫున వాదించిన డిఫెన్స్ లాయర్ తెలిపారు.

  • Loading...

More Telugu News